Breaking News
Home / National / ఐఎస్‌ఎల్‌-ప్రీమియర్‌ లీగ్‌ల మధ్య కొత్త ఒప్పందం

ఐఎస్‌ఎల్‌-ప్రీమియర్‌ లీగ్‌ల మధ్య కొత్త ఒప్పందం

ముంబై: ప్రీమియర్‌ లీగ్‌, ఇండియన్‌ సూపర్‌ లీగ్‌(ఐఎస్‌ఎల్‌)ల మధ్య కొత్త ఒప్పందం కుదిరింది. నెక్ట్స్‌ జనరేషన్‌ ముంబై కప్‌లో భాగంగా శుక్రవారం ఫుట్‌బాల్‌ స్పోర్ట్స్‌ డెవలప్‌మెంట్‌ లిమిటెడ్‌ చైర్‌పర్సన్‌ నీతా అంబానీ, ప్రీమియర్‌ లీగ్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ రిచర్డ్‌ మాస్టర్స్‌ను కలిశారు. ఈ సందర్భంగా నీతా అంబానీ, రిచర్డ్‌లు కొత్త ఒప్పందంపై సంతకం చేశారు. గత ఆరేళ్ల నుంచి ఈ రెండు లీగ్‌లు కలిసి పనిచేస్తున్న సంగతి తెలిసిందే. తాజా ఒప్పందం ప్రకారం భారతలో ఫుట్‌బాల్‌ అభివృద్ధితోపాటు, కోచింగ్‌ సౌకర్యాలు, యువతలో ఫుట్‌బాల్‌ నైపుణ్యాలు పెంపొందించడానికి ఈ రెండు సంస్థలు కలిసి పనిచేయనున్నాయి.

ఈ సందర్భంగా నీతా అంబానీ మాట్లాడుతూ.. ప్రీమియర్‌ లీగ్‌తో ఐఎస్‌ఎల్‌ భాగస్వామ్యం మరో దశకు చేరుకుందన్నారు. గత ఆరేళ్లుగా భారత్‌లో ఫుట్‌బాల్‌ అభివృద్ధి తాము చేసిన కృషి సంతృప్తినిచ్చిందని తెలిపారు. యువతలో నైపుణ్యం పెంపొందించడం, కోచింగ్‌, రిఫరీ అంశాలను మరింత బలోపేతం చేయడానికి రెండు లీగ్‌ల మధ్య కుదిరిన నూతన ఒప్పందం తోడ్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *