Breaking News
Home / States / Andhra Pradesh / విశాఖలో సందడి చేయనున్న భారత్ జట్టు…

విశాఖలో సందడి చేయనున్న భారత్ జట్టు…

విశాఖ: విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో బుధవారం నుంచి సౌతాఫ్రికాతో భారత జట్టు తొలి టెస్టులో తలపడనుంది. ఈ నేపథ్యంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ వృద్దిమాన్ సాహా, కుల్దీప్ యాదవ్, శుభ్‌మన్ గిల్ ఆదివారమే విశాఖ చేరుకున్నారు. తాజాగా ఇరుదేశాల ఆటగాళ్లు సోమవారం నెట్ ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు. హెడ్‌కోచ్ రవిశాస్త్రి పర్యవేక్షణలో సీనియర్ పేసర్లు మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ బౌలింగ్ సాధన చేశారు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్లో పోస్ట్ చేసింది. మరోవైపు సౌతాఫ్రికా క్రికెటర్లు సైతం బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో ప్రాక్టీస్ చేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *