Breaking News
Home / Sports / భారత టెన్నిస్‌ స్టార్‌ కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌…

భారత టెన్నిస్‌ స్టార్‌ కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌…

ఇంటర్నెట్‌డెస్క్‌: తాజాగా ప్రకటించిన ఏటీపీ ర్యాంకింగ్స్‌లో భారత టెన్నిస్‌ స్టార్‌ ప్లేయర్‌ సుమిత్‌ నగల్‌ పురుషుల సింగిల్స్‌ విభాగంలో కెరీర్‌ అత్యుత్తమ 129 ర్యాంక్ సాధించాడు. ఏటీపీ ఛాలెంజర్‌ పోటీల్లో గతవారం ఫైనల్‌ చేరిన అతడు అర్జెంటీనాకు చెందిన జువాన్‌ ఫికోవిచ్‌ చేతిలో ఓటమి చెందాడు. ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో సుమిత్‌ 4-6, 1-6 తేడాతో ఓడిపోయాడు. ఇదిలా ఉండగా కొద్దిరోజుల క్రితం జరిగిన బ్యూనస్‌ ఎయిర్స్‌ ఏటీపీ ఛాలెంజర్‌ ఈవెంట్‌లో సుమిత్‌ పురుషుల సింగిల్స్‌ విభాగంలో టైటిల్‌ సాధించాడు. ఈ విజయంతో ఒకేసారి 26 స్థానాలు ఎగబాకిన అతడు 135వ ర్యాంక్‌ సాధించాడు. ఈ నేపథ్యంలో తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో సుమిత్‌ ఆరు స్థానాలు మెరుగుపడి 129వ ర్యాంక్‌కు చేరుకున్నాడు.

Check Also

భారత్‌–ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌పై లయన్‌ వ్యాఖ్య

Share this on WhatsAppసిడ్నీ: విరాట్‌ కోహ్లి నాయకత్వంలో టీమిండియా ఆస్ట్రేలియా గడ్డపై 2018–19 టెస్టు సిరీస్‌ను 2–1తో సొంతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *