Breaking News
Home / States / Andhra Pradesh / భక్తజన సందోహంగా మారిపోయిన ఇంద్రకీలాద్రి

భక్తజన సందోహంగా మారిపోయిన ఇంద్రకీలాద్రి

విజయవాడ : ఇంద్రకీలాద్రి భక్తజన సందోహంగా మారిపోయింది. ఆదివారం దుర్గాదేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శనార్థం వేలమంది భక్తులు తరలివస్తున్నారు. జై దుర్గా, జైజై దుర్గా అనే నినాదాలతో ఇంద్రకీలాద్రి మార్మోగిపోయింది. అయితే అమ్మవారి దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతుందని దేవాలయం అధికారులు తెలిపారు.

రద్దీ దృష్ట్యా 300,100 రూపాయల టిక్కెట్లను రద్దు చేయడంతో పాటు, అంతరాలయ దర్శనాన్ని కూడా అధికారులు నిలిపివేశారు. అయితే, ముఖమండప దర్శనానికి భక్తులకు అనుమతినిచ్చారు. వీఐపీల తాకిడి తీవ్రంగా ఉండటంతో సామాన్య భక్తులకు తిప్పలు తప్పడం లేదు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *