Breaking News
Home / Crime / సర్జరీ అనంతరం ఇన్ఫెక్షన్… ట్రాన్స్‌జండర్ మృతి

సర్జరీ అనంతరం ఇన్ఫెక్షన్… ట్రాన్స్‌జండర్ మృతి

రాయ్‌పూర్(ఛత్తీస్‌గఢ్): రాయ్‌పూర్‌లోని డీకేఎస్ ఆసుపత్రిలో యువతిగా మారాలనుకున్న 30 ఏళ్ల యువకుడు ఇన్ఫెక్షన్ కారణంగా మృతి చెందారు. గత ఏడాది డిసెంబరులో జండర్ మార్చుకునేందుకు అతనికి తొలిసారి సర్జరీ జరిగింది. తరువాత దశలవారీగా ఆపరేషన్లు చేస్తూ వచ్చారు. తాజాగా ఐదవసారి ఆపరేషన్ చేశారు. ఈ నేపధ్యంలోనే అతను మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరిగిందని మృతుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కాగా పోస్టుమార్టం అనంతరం ఆ యువకుని మృతికి గల కారణాలు వెల్లడవుతాయని పోలీసులు పేర్కొన్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం బిలాస్‌పూర్‌నకు చెందిన 30 ఏళ్ల యువకునికి ఏడాది క్రితం సెక్స్ రిసైన్మెంట్ సర్జరీ జరిగింది. ఆ సమయంలో ప్లాస్టిక్ సర్జన్ టీమ్ ఆ యవకుని జండర్ మార్పునకు అతని శరీరంలోని వివిధ అంగాలకు ఆపరేషన్ నిర్వహించింది. ఈ సర్జరీ విజయవంతంగానే జరిగినప్పటికీ, ఇన్ఫెక్షన్ సోకిందని వైద్యులు తెలిపారు. ఈ సమస్య పరిష్కారం కోసం మరోమారు అతనికి ఆపరేషన్ నిర్వహించారు. జనరల్ సర్జన్ డాక్టర్ గోయంకా, గ్యాస్ట్రో సర్జన్ డాక్టర్ రోమిల్ జైన్ నేతృత్వంలో ఈ ఆపరేషన్ జరిగింది. సర్జరీ అనంతరం బాధితుడిని ఎస్ఐసీయూలో ఉంచారు. అయినప్పటికీ అతనిలో ఇన్ఫెక్షన్ పెరుగుతూ వచ్చి, చివరికి మృతి చెందాడు. ఈ సందర్భంగా డీకేఎస్‌కు చెందిన ప్లాస్టిక్ సర్జరీ విభాగం హెచ్ఓడీ డాక్టర్ దక్షేశ్ షాహ్ మాట్లాడుతూ అతనికి ఆపరేషన్ విజయవంతంగా జరిగినప్పటికీ అనంతరం ఇన్ఫెక్షన్ సోకిందన్నారు. ఈ నేపధ్యంలో జనరల్ సర్జన్ నాలుగుసార్లు ఆపరేషన్ చేశారన్నారు. అయినప్పటికీ బాధితుడిని కాపాడలేకపోయామని తెలిపారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *