Breaking News
Home / National / సంయుక్త కమిటీకి సమాచార రక్షణ బిల్లు…

సంయుక్త కమిటీకి సమాచార రక్షణ బిల్లు…

ఢిల్లీ: లోక్‌సభలో ప్రతిపక్షాల నిరసనల మధ్య పౌరుల సమాచార రక్షణ చట్టం బిల్లును సంయుక్త ఎంపిక కమిటీ పరిశీలనకు పంపేందుకు కేంద్రం బుధవారం నిర్ణయించింది. ఈ బిల్లు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉందని కాంగ్రెస్‌, టీఎంసీ పార్టీలు ఆరోపించాయి. దీని ద్వారా పౌరుల సమాచార గోప్యత హక్కుకు భంగం వాటిల్లే ప్రమాదం ఉందని దీన్ని డిపార్ట్‌మెంటల్‌ స్టాండింగ్‌ కమిటీకి పంపాలని కాంగ్రెస్‌ నేత శశిథరూర్‌ డిమాండ్ చేశారు. దీంతో కేంద్ర సమాచార మంత్రి రవిశంకర్‌ స్పందిస్తూ.. ప్రతిపక్షాల వ్యాఖ్యలను ఖండించారు. ప్రభుత్వం గురువారం ఈ బిల్లును సంయుక్త కమిటీకి పంపుతుందని ప్రసాద్‌ చెప్పారు. పార్లమెంటరీ ప్యానెల్‌ దీన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తుందని చెప్పారు.

‘ఈ బిల్లును పరిశీలించే కమిటీలో లోక్‌సభ నుంచి 20 మంది సభ్యులు, రాజ్యసభ నుంచి 10 సభ్యులు ఉంటారు. లోక్‌సభ స్పీకర్‌ ఈ కమిటీకి ఒకరిని ఛైర్మన్‌గా నియమిస్తారు. రాబోయే బడ్జెట్‌ సమావేశాలు ముగిసేలోపు ఈ కమిటీ బిల్లుకు సంబంధించిన నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. ఈ అంశంపై కమిటీతో చర్చించడానికి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రికి స్పీకర్‌ సూచించారు. ఈ బిల్లు కేవలం ప్రజల సమాచారాన్ని రక్షించడం కోసమే. సమాచార గోప్యత అనేది ప్రజల ప్రాథమిక హక్కే కానీ ఉగ్రవాదులు దీన్ని నాశనం చేస్తున్నారు.  జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ ఈ బిల్లుపై సుదీర్ఘ సంప్రదింపుల చేసిన తర్వాతే సభ ముందుకు తీసుకువచ్చాం. ఈ బిల్లు ద్వారా ప్రజల సమాచారాన్ని మూడు విభాగాలుగా విడగొడతాం. ఒక వ్యక్తి అనుమతి లేకుండా వారి వ్యక్తిగత డేటాను ప్రాసెస్‌ చేయాలంటే ఈ బిల్లు అనుమతించదు. మన సమాచారాన్ని చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో ఉపయోగించకుండా తోడ్పడుతుంది’ అని మంత్రి రవి శంకర్ ప్రసాద్‌ వెల్లడించారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *