Breaking News
Home / States / సచివాలయం కూల్చివేత పై హైకోర్టులో విచారణ

సచివాలయం కూల్చివేత పై హైకోర్టులో విచారణ

హైదరాబాద్‌: సచివాలయాన్ని కూల్చివేసి దాని స్థానంలో కొత్త నిర్మాణాలు చేపట్టాలన్న ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ కొందరు కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీంతో హైకోర్టు ఈ కేసు విచారణ ప్రారంభించింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం టెక్నికల్‌ రిపోర్టును హైకోర్టుకు సమర్పించింది. సచివాలయంలోని పలు భవనాలు శిధిలావస్థకు చేరాయని అందుకే వాటిస్థానంలో కొత్త నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించినట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఏడేళ్ల క్రితం నిర్మించిన హెచ్‌బ్లాక్‌ను బ్లాక్‌ను ఎందుకు కూల్చివేస్తున్నారని కోర్టు ప్రశ్నించింది. సుమారు 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇంటి గ్రేటెడ్‌ సచివాలయం నిర్మిస్తామని ప్రభుత్వం కోర్టుకు వివరించింది. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో కోర్టులు జోక్యం చేసుకోరాదని ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో తాము ఎలా జోక్యం చేసుకోవాలో తెలపాలని హైకోర్టు పిటిషనర్‌ను కోరింది. ప్రభుత్వ నిర్ణయం చట్టవ్యతిరేకంగా ఉన్నాయా? లేవా? తెలపాలని పిటిషనర్‌ను కోర్టు ప్రశ్నించింది. తదుపరి విచారణను ఈనెల 21కి వాయివేసింది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *