కృష్ణా : ప్రైవేటు కళాశాల హాస్టల్ విద్యార్థిని ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం తిరువూరులో చోటు చేసుకుంది. గంపలగూడెం మండలంకు చెందిన స్వప్న అనే విద్యార్థిని, సెకండ్ ఇంటర్ ఎంపీసీ చదువుతూ తిరువూరులోని కళాశాల హాస్టల్లో ఉంటుంది. ఈరోజు ఉదయం రూమ్లో ఎవరూలేని సమయంలో చున్నీతో ఉరేసుకొని విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని విచారణ చేపడుతున్నారు.
