Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / వరుణ దేవుడిని కూడా జైలుకు తీసుకెళ్తారు….

వరుణ దేవుడిని కూడా జైలుకు తీసుకెళ్తారు….

అమరావతి: అసెంబ్లీలో ఆసక్తికర చర్చ జరిగింది. ప్రతిపక్ష నేత చంద్రబాబుకు 70 ఏళ్లు వచ్చాయని, ఈ వయసులో చంద్రబాబు తమతో తిట్లు తినే పరిస్థితి తెచ్చుకుంటున్నారని సభలో మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకు స్పందించిన చంద్రబాబు.. అంతే ధీటుగా సమాధానం చెప్పారు. ‘నా వయసు ఎంత ఉన్నా.. 25 ఏళ్ల కుర్రాడికి ఉన్న ఆలోచనలు నాకు ఉంటాయి. మళ్లీ రాష్ట్రాన్ని గాడిన పెట్టే వరకు విశ్రమించబోను. 150 ఎమ్మెల్యేలు దాడి చేసినా సమాధానం చెప్పే శక్తి నాలో ఉంది. నా దగ్గర మైండ్‌ గేమ్స్ చెల్లవు. జగన్ మైండ్ గేమ్స్ బాగా ఆడుతారు. వరుణ దేవుడిని కూడా జైలుకు తీసుకెళ్తారనే భయంతో వర్షాలు పడుతున్నాయి’ అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *