Breaking News
Home / hyderabad / నేటి నుంచి ఇంటర్‌ పరీక్షలు…

నేటి నుంచి ఇంటర్‌ పరీక్షలు…

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ పరీక్షలు నేటి నుంచి ప్రారంభమవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 9 లక్షల 65 వేల 839 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని ఇంటర్‌బోర్డు కార్యదర్శి తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షల నిర్వహణ జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి పరీక్ష కేంద్రంలోకి విద్యార్థులను అనుమతిస్తారు. ఉదయం 8.45 గంటలకు తమకు కేటాయించిన సీట్లో విద్యార్థులు కూర్చోవాలి. ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్షలకు అనుమతి ఉండదు. విద్యార్థులు నేరుగా వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకునే వీలుంది. నేడు ఇంటర్ మొదటి సంవత్సరం, రేపు ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభం. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలకు 4 లక్షల 80 వేల 516 మంది విద్యార్థులు హాజరుకానున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *