Breaking News
Home / National / రాష్ట్ర గవర్నరుకు బెదిరింపు లేఖ..హోంశాఖ దర్యాప్తు

రాష్ట్ర గవర్నరుకు బెదిరింపు లేఖ..హోంశాఖ దర్యాప్తు

లక్నో (ఉత్తరప్రదేశ్): ఉత్తరప్రదేశ్ రాష్ట్ర గవర్నరు ఆనందిబెన్ పటేల్ కు ఆగంతకుడి నుంచి బెదిరింపు లేఖ లక్నోలోని రాజ్‌భవన్‌కు వచ్చింది. ప్రథమ పౌరురాలైన గవర్నరుకే బెదిరింపు లేఖ రావడంతో యూపీ హోంమంత్రిత్వ శాఖ అప్రమత్తమైంది. గవర్నరుకు వచ్చిన బెదిరింపు లేఖను తీవ్రంగా పరిగణించిన హోంశాఖ సెక్యూరిటీ అదనపు డైరెక్టరు జనరల్, ఇంటలిజెన్స్ విభాగం డైరెక్టరు జనరల్‌లు దర్యాప్తు ప్రారంభించారు. 2014 నుంచి 2016 వరకు ఆనందిబెన్ పటేల్ గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. అనంతరం మధ్యప్రదేశ్ రాష్ట్ర గవర్నరుగా పనిచేసి, ఈ ఏడాది జులై 20వతేదీన ఉత్తరప్రదేశ్ రాష్ట్ర గవర్నరుగా ఆనందిబెన్ పటేల్‌ను రాష్ట్రపతి బదిలీచేశారు. సాక్షాత్తూ యూపీ గవర్నరుకు బెదిరింపు లేఖ రావడం యూపీలో సంచలనం రేపింది.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *