Breaking News
Home / Lifestyle / Business / స్టాక్‌ మార్కెట్ల పతనంతో ఇన్వెస్టర్లు భారీ మొత్తంలో నష్టపోవాల్సి వచ్చింది

స్టాక్‌ మార్కెట్ల పతనంతో ఇన్వెస్టర్లు భారీ మొత్తంలో నష్టపోవాల్సి వచ్చింది

ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్ల దిశను నిర్దేశించడంలో కీలకమైన 2019-20 బడ్జెట్‌.. ఇన్వెస్టర్లలో ఆందోళనలను రేకెత్తించింది. బడ్జెట్‌లో విత్త మంత్రి నిర్మలా సీతారామన్‌ చేసిన పలు ప్రతిపాదనలు మార్కెట్‌ పండితులు కూడా ఊహించని విధంగా ఉన్నాయి. ముఖ్యంగా లిస్టెడ్‌ కంపెనీల్లో పబ్లిక్‌ షేరు హోల్డింగ్‌ను 25 శాతం నుంచి 35 శాతానికి పెంచుతూ చేసిన ప్రతిపాదన మార్కెట్లలో నష్టాలకు దారితీసింది. ఈ ప్రతిపాదన మూలంగా మార్కె ట్లో లిక్విడిటీపై ప్రభావం ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశీయ స్టాక్‌ మార్కెట్ల నాలుగు రోజుల వరుస లాభాలకు శుక్రవారం తెరపడింది.

ఆరంభంలో ఆశలు..
ఇన్వెస్టర్లు ఈ బడ్జెట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మంచి తాయిలాలు ఉంటాయనుకున్నారు. ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో రికవరీకి, ఉపాధి కల్పనకు దోహదపడే నిర్ణయాలు వెలువడుతాయని ఆశించారు. ఆ జోష్‌లోనే శుక్రవారంనాటి ట్రేడింగ్‌ను మొదలెట్టారు. దీంతో బీఎ్‌సఈ సెన్సెక్స్‌ ప్రారంభంలోనే మంచి లాభాలతో 40,000 పాయింట్లను దాటేసింది. ఎన్‌ఎ్‌సఈ నిఫ్టీ 12,000 పాయింట్లకు చేరువైంది. కానీ తర్వాత ట్రేడింగ్‌లో మార్కెట్‌ హెచ్చుతగ్గులు చవిచూస్తూ వెనకడుగు వేసింది. 11.30 గంటల తర్వాత క్రితం ముగింపుకన్నా దిగువకు జారిపోయింది. ఆ తర్వాతి నుంచి నష్టాలు పెరుగుతూ తగ్గుతూ వచ్చాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 39,441 పాయింట్ల కనిష్ఠ స్థాయికి జారిపోయింది. నిఫ్టీ 11,797.90 పాయింట్ల కనిష్ఠ స్థాయిని నమోదు చేసుకుంది. తీవ్ర ఒడుదొడుకుల తర్వాత చివరకు సెన్సెక్స్‌ 394.67 పాయింట్ల నష్టంతో 39,513.39 పాయింట్లు, నిఫ్టీ 135.60 పాయింట్ల నష్టంతో 11,811.15 పాయిం ట్ల వద్ద ముగిశాయి. బడ్జెట్‌ ప్రసంగం ముగిసిన తర్వాత మార్కెట్లు ఎక్కువ నష్టాలను చవిచూశాయి.

  • సెన్సెక్స్‌ షేర్లలో యెస్‌ బ్యాంక్‌ అత్యధికంగా (8.36 శాతం) నష్టపోయింది. దీని తర్వాత ఎన్‌టీపీసీ, ఎం అండ్‌ ఎం, వేదాంత, సన్‌ఫార్మా, టీసీఎ్‌సలు గరిష్ఠంగా 4.81 శాతం వరకు నష్టపోయాయి.
  • ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, కోటక్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, ఐటీసీ, భారతీ ఎయిర్‌టెల్‌, ఐసీఐసీఐ బ్యాంకుల షేర్లు గరిష్ఠంగా 2.16 శాతం వరకు పెరిగాయి.
  • రంగాల వారీగా చూస్తే.. బీఎ్‌సఈ మెటల్‌, రియల్టీ, పవర్‌, ఆటో, ఐటీ, బేసిక్‌ మెటీరియల్స్‌, యుటిలిటీస్‌, ఆయిల్‌, గ్యాస్‌, ఇండస్ర్టియల్స్‌,
  • ఎనర్జీ, క్యాపిటల్‌ గూడ్స్‌ సూచీలు 3.85 శాతం వరకు నష్టపోయాయి.
  • ఎఫ్‌ఎంసీజీ, బ్యాంకెక్స్‌, టెలీకాం సూచీలు 0.18 శాతం వరకు లాభపడ్డాయి.
  • రూ.2.22 లక్షల కోట్లు తగ్గిన ఇన్వెస్టర్ల సంపద

స్టాక్‌ మార్కెట్ల పతనంతో ఇన్వెస్టర్లు భారీ మొత్తంలో నష్టపోవాల్సి వచ్చింది. శుక్రవారంనాడు బీఎ్‌సఈ 395 పాయింట్లు కోల్పోవడం వల్ల ఇన్వెస్టర్ల సంపద రూ.2.22 లక్షల కోట్లకు పైగా తగ్గిపోయింది. దీంతో బీఎ్‌సఈలో లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.1,51,35,495.86 కోట్లకు చేరుకుంది.

Check Also

స్వల్ప లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు….

Share this on WhatsAppముంబై : ప్రపంచ మార్కెట్ల పాజిటివ్‌ సంకేతాలతో దేశీయ స్టాక్‌మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమైనాయి. సెన్సెక్స్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *