Breaking News
Home / States / ఆర్టీసీలో కొత్తగా కొలువులకు ఆహ్వానం…

ఆర్టీసీలో కొత్తగా కొలువులకు ఆహ్వానం…

హైదరాబాద్‌: కార్మికుల సమ్మె నేపథ్యంలో డ్రైవర్‌, కండక్టర్‌ పోస్టులకు సంబంధించి సోమవారం ఆర్టీసీ కొత్త ఉద్యోగుల నియామకం ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల దగ్గర అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. నియామకాలు పారదర్శకంగా జరుగుతున్నాయన్నారు. అయితే తాత్కాలిక ఉద్యోగులుగానే తీసుకుంటున్నామని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.

డ్రైవర్‌కు రోజుకు రూ.1500, కండక్టర్‌కు రూ.1000 పారితోషికం ఇస్తామని అధికారులు పేర్కొన్నారు. రిటైర్డ్ ట్రాఫిక్‌, మెకానికల్‌ సూపర్‌వైజర్‌ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. వారికి రోజూ రూ.1500, డిపోల్లో రిటైర్ట్‌ మెకానిక్‌లు, శ్రామిక్‌లు, ఎలక్ర్టీషియన్లు, టైర్‌ మెకానిక్‌లు, క్లరికల్‌గా పనిచేసే వారికి రోజుకు రూ.1000 పారితోషికం ఇస్తామని అధికారులు తెలిపారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *