Breaking News
Home / Sports / ఐపీఎల్-70 మంది ఆటగాళ్లను వేలం….

ఐపీఎల్-70 మంది ఆటగాళ్లను వేలం….

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 12వ సీజన్ సీజన్ కోసం సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సీజన్‌కు సంబంధించి బీసీసీఐ కీలక ప్రకటన చేసింది. ఎనిమిది ఫ్రాంచైజీలు ఆటగాళ్ల కోసం పోటీపడే ఐపీఎల్ వేలం ఈ నెల 18వ తేదీన జరుగనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఓ ప్రముఖ స్పోర్ట్స్ పత్రిక కథనం ప్రకారం.. ఈ వేలం ఈసారి జైపూర్‌లో జరుగనుంది. గతంలో బెంగళూరు, ముంబై నగరాల్లో ఈ వేలం జరిగింది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఈసారి 70 మంది ఆటగాళ్లను వేలం పాడనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందుకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Check Also

ఆట ఆరంభంలోనే భారత్‌కు షాక్

Share this on WhatsAppపెర్త్: నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఒప్టస్‌ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *