Breaking News
Home / National / ఇక్బాల్ మిర్చి అనుచరుడు అరెస్ట్….

ఇక్బాల్ మిర్చి అనుచరుడు అరెస్ట్….

ముంబై: మనీ లాండరింగ్ కేసులో గ్యాంగ్‌స్టర్ ఇక్బాల్ మిర్చి అనుచరుడు హుమాయున్ మర్చెంట్‌ను ఈడీ అధికారులు నిన్న రాత్రి అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. హుమాయున్‌ను ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టి కస్టడీకి తరలించనున్నట్లు వెల్లడించారు. ఇక్బాల్ మిర్చి, అతని కుటుంబానికి సంబంధించి అక్రమంగా రియల్ ఎస్టేట్ వ్యాపార ఒప్పందాలు చేస్తున్నట్లు హుమాయున్‌పై ఆరోపణలున్నాయి. ఈ విషయమై అతన్ని ఈడీ విచారించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఈడీ ఇప్పటికే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసింది. ఉగ్రవాది దావూద్ ఇబ్రహీంకు ఇక్బాల్ మిర్చి అత్యంత సన్నిహితుడు. ఇక్బాల్ మిర్చితో సంబంధాలున్నట్లు ఎన్‌సీపీ నేత ప్రపుల్ పటేల్‌పై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *