Breaking News
Home / Featured / బ్యాటరీ డౌన్‌ అయిపోతోందా? ఇలా చేయండి..

బ్యాటరీ డౌన్‌ అయిపోతోందా? ఇలా చేయండి..

ఇంటర్నెట్‌డెస్క్‌: ఫీచర్‌ ఫోన్‌ పోయి స్మార్ట్‌ఫోన్‌ చేతికొచ్చింది. స్క్రీన్‌ సైజ్‌ అంతకంతకూ పెరిగిపోతోంది. కొత్త కొత్త ఫీచర్లు అందుబాటులోకి వస్తున్నాయి. కొన్నేళ్లలో మొబైళ్లలో విపరీతమైన మార్పులు వస్తున్నప్పటికీ.. అప్పటికీ ఇప్పటికీ ఒకటే సమస్య.. బ్యాటరీ. ఫోన్‌లో బ్యాటరీ సామర్థ్యం పెరుగుతున్నా.. అదేస్థాయిలో వాడకమూ పెరుగుతోంది. దీంతో సాయంత్రం అయ్యేసరికి బ్యాటరీ డౌన్‌ అయిపోతోంది. దీంతో అప్పటి వరకు విచ్చలవిడిగా ఫోన్‌ వాడిన వారంతా రెడ్‌ మార్క్‌ కనిపించగానే పొదుపు మంత్రం పాటిస్తుంటారు. బ్యాటరీకి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడమే ఇందుక్కారణం. అందుకోసం ఈ చిట్కాలు పాటించండి..

* చాలా మంది ఫోన్‌ డేటాను ఎప్పుడూ ఆన్‌లోనే ఉంచుతుంటారు. కొన్నిసార్లు వైఫై అందుబాటులో ఉన్నప్పటికీ ఏదైతే ఏముందిలే అనుకుంటూ మొబైల్‌ డేటానే కొనసాగిస్తుంటారు. దీంతో బ్యాటరీ త్వరగా ఖాళీ అయిపోతుంది. మీకు వైఫై అందుబాటులో ఉన్నప్పుడు దాన్ని ఉపయోగించడమే మంచి పద్ధతి.
* కొన్ని యాప్స్‌ వినియోగానికి జీపీఎస్‌ ఆన్‌లో ఉంచడం తప్పనిసరి. ఓలా, ఉబర్‌ వంటి యాప్స్‌ వినియోగానికి జీపీఎస్‌ ఆన్‌ చేస్తుంటాం. చాలా మంది ఆ యాప్స్‌ వాడిన తర్వాత జీపీఎస్‌ను ఆఫ్‌ చేయడం మరిచిపోతుంటారు. దీనివల్ల బ్యాటరీ త్వరగా పూర్తయిపోతుంది. అవసరం లేని సమయంలో జీపీఎస్‌ను ఆఫ్‌లో ఉంచడం మేలు.

* ఫోన్‌ నోటిఫికేషన్‌ బార్‌లో ఉండే ఐకాన్స్‌పై ఓ కన్నేసి ఉంచండి. బ్లూటూత్‌, వైఫై ఆన్‌లో ఉన్నాయో లేదో చూసుకోండి. లేదంటే అవి మీ ఫోన్‌ బ్యాటరీని పీల్చేస్తాయి.
* బ్యాటరీ ఎక్కువ సేపు రావాలంటే ఫోన్‌లో ఉండే పవర్‌ సేవింగ్‌ మోడ్‌/లో పవర్‌ మోడ్‌ వాడడం మంచిది. దీనివల్ల ఫోన్‌లో ఉండే సీపీయూ ఎంత మేర అవసరమో అంత మేరకే పనిచేస్తుంది. అక్కర్లేని యాప్స్‌ బ్యాగ్రౌండ్‌లో రన్‌ కాకుండా చూస్తుంది. దీనివల్ల ఫోన్‌ను ఎక్కువసేపు ఉపయోగించొచ్చు.
* ఫోన్‌ బ్రైట్‌నెస్‌ను తగ్గించడం ద్వారా ఫోన్‌ను మరింత ఎక్కువ సేపు వినియోగించొచ్చు. దీంతో పాటు పోన్‌లో ఉండే డార్క్‌మోడ్‌/నైట్‌ మోడ్‌ ఫీచర్‌ను వినియోగిస్తే మళ్లీ మళ్లీ ఛార్జింగ్‌ పెట్టుకునే బాధ తప్పుతుంది.
* అవసరం అనుకుంటేనే వైబ్రేషన్‌ వాడడం మంచిది. అలాగే, స్ర్కీన్‌ టైమ్‌ను కూడా వీలైనంత తక్కువగా సెట్‌ చేసుకోవడం ద్వారా బ్యాటరీ లైఫ్‌ పెంచుకోవచ్చు.
* చాలా మంది లైవ్‌ వాల్‌పేపర్లు వాడుతుంటారు. బ్యాటరీ పొదుపు కోరుకునేవారు వీటికి దూరంగా ఉండడం మంచిది.

Check Also

బాధితులకు మహిళా కమిషన్ అండగా ఉంటుంది

Share this on WhatsAppగుంటూరు: విద్యార్థినులను అసభ్యంగా వీడియోలు తీసి సోషల్‌ మీడియాలో పెట్టి బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్న ఘటనలు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *