Breaking News
Home / Film News / ఈషా లుక్‌ను విడుదల చిత్రబృందం…

ఈషా లుక్‌ను విడుదల చిత్రబృందం…

ఫిల్మ్ న్యూస్: పలు వినోదాత్మక చిత్రాలు రూపొందించిన దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి తెరకెక్కించిన తాజా చిత్రం `రాగల 24 గంటల్లో`. ఈషా రెబ్బ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రంగా తెరకెక్కుతోంది. పలు సినిమాల్లో సెకెండ్ హీరోయిన్ పాత్రలు చేసిన ఈషాకు ఇది మంచి అవకాశమనే చెప్పాలి. ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలో నటించడం ఈషాకు ఇదే తొలిసారి. ఈ సినిమాలో ఈషా లుక్‌ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది.

సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్ ఇటీవలె విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సత్యదేవ్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రానికి రఘు కుంచె సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *