తిరుపతి : అధిక బరువు తగ్గించడం, బ్యూటీషియన్ వంటి రంగాల్లో వ్యాపారాలు నిర్వహిస్తున్న, హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ సంస్థ కలర్స్ హెల్త్ కేర్ బ్రాంచ్‌లపై ఐటీ అధికారులు దాడి చేశారు. ఆదాయపు పన్ను సరిగా చెల్లించడం లేదని గుర్తించిన అధికారులు.. సదరు యాజమాన్యానికి నోటీసులు ఇచ్చినా స్పందించకుండా నిర్లక్ష్యం చేసింది. దీంతో కలర్స్ హెల్త్ కేర్ సంస్థకు దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 49 బ్రాంచ్‌ల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. పలు కీలక పత్రాలు, రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. దాడులకు సంబంధించి ఐటీ అధికారులు కానీ, కలర్స్ సంస్థ ప్రతినిధులు కానీ వివరణ ఇచ్చేందుకు నిరాకరించారు.
