హైదరాబాద్: సినీ నిర్మాణ, పంపిణీ సంస్థ ఏషియన్ కార్యాలయాలపై ఐటీ దాడులు నిర్వహించింది. ఏషియన్ సినిమా అధినేతలు నారాయణదాష్ నారంగ్, సునీల్ నారంగ్ ఇళ్లలో సోదాలు నిర్వహించారు. వారి సన్నిహితుల ఇళ్లల్లో కూడా ఐటీ సోదాలు జరిగాయి. నైజాంలో చిత్రాల పంపిణీ, ఏషియన్ థియేటర్లను నారంగ్ నిర్వహిస్తున్నారు. హీరో మహేష్‌బాబుతో కలిసి ఎఎంబీ మాల్‌ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం నాగచైతన్య హీరోగా శేఖర్‌కమ్ముల దర్శకత్వంలో సినిమా తీస్తున్నారు. త్వరలో హీరో అల్లు అర్జున్‌తో కలిసి మరో మల్టిఫ్లెక్స్ నిర్మాణం చేపడుతున్నారు.
