Breaking News
Home / States / Andhra Pradesh / రాజ్యాంగానికి కట్టుబడి ఉండటం గర్వకారణం….

రాజ్యాంగానికి కట్టుబడి ఉండటం గర్వకారణం….

విజయవాడ: ముస్లింలు అందరూ ఒక్కటే అనే భావాన్ని అందరిలో తీసుకురావాలనే ఉద్దేశంతో ఆల్ ఇండియా ముస్లిమ్స్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేయడం జరిగిందని ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా అన్నారు. శనివారం ఆల్ ఇండియా ముస్లిమ్స్ కౌన్సిల్ మీటింగ్‌కు ముఖ్య అతిథిగా అంజాద్ బాషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన.. ఆల్ ఇండియా కౌన్సిల్ ఒక మంచి ప్లాట్‌ఫామ్ అని పేర్కొన్నారు. ఈ సమావేశానికి 27 రాష్ట్రాల నుంచి ఖాజీలు రావడం మంచి పరిణామం అన్నారు. ఈ ఆల్ ఇండియా కౌన్సిల్ కార్యక్రమాలను 1992లో భారతదేశంలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. భారతదేశంలో ముస్లింలు అందరూ ఒక మాట మీద ఉండి.. వారి సమస్యలను తెలుసుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి అనుగుణంగా ముస్లింలు అంతా కట్టుబడి ఉండటం గర్వకారణంగా ఉందని పేర్కొన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *