Breaking News
Home / States / సీఎంను దూషించడం సరికాదు…

సీఎంను దూషించడం సరికాదు…

హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులను అడ్డుపెట్టుకుని కొన్ని విద్రోహ శక్తులు,  ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలని చూస్తున్నాయని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని కార్మికులు గమనించాలని కోరారు. కార్మికుల సమస్యలపై కార్మికులే గళమెత్తాలని సూచించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రాభివృద్ధిని చూసి ఓర్వలేకనే కుట్రలకు తెరలేపుతున్నారని అన్నారు. ప్రభుత్వానికి, ఆర్టీసీ జేఏసీకి మధ్య తాను మధ్యవర్తిత్వం చేయాలని కార్మికులు డిమాండ్ చేశారని, తనను ఎవరూ అడ్డుకోలేదని చెప్పుకొచ్చారు. కార్మికులను కలిసేందుకే వచ్చానని మంత్రి స్పష్టం చేశారు. కొంతమంది పనిగట్టుకుని విషం కక్కుతున్నారని ధ్వజమెత్తారు. కార్మికుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని మంత్రి తెలిపారు. కార్మికులు సీఎంను దూషించడం పద్దతి కాదన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *