Breaking News
Home / States / Andhra Pradesh / రైతులను బాధపెట్టడం సరికాదు…

రైతులను బాధపెట్టడం సరికాదు…

నెల్లూరు : నెల్లూరులో టీడీపీ నేతలు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ… ఏపీ అసెంబ్లీలో సీఎం చెప్పిన విషయాలే జీఎన్ రావు, బీసీజీ కమిటీ నివేదికల్లో ఉన్నాయని విమర్శించారు. ప్రధాని శంకుస్థాపన చేసి నిధులు కూడా ఇచ్చాక, ఇప్పుడు రాజధాని మార్చుతుంటే కేంద్రం చూస్తూ ఊరుకోదని అన్నారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులను బాధపెట్టడం సరికాదని సోమిరెడ్డి హితవు పలికారు. వైసీపీ ప్రభుత్వం తమ వైఖరి మార్చుకోవాలని సూచించారు.

Check Also

డ్రోన్లతో చిత్రీకరించారనడం అవాస్తవం

Share this on WhatsAppగుంటూరు: గత ఐదేళ్లలో తెదేపా అవినీతి బాగోతాలు బయటకు వస్తున్నాయని హోంమంత్రి సుచరిత అన్నారు. ప్రజల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *