Breaking News
Home / Film News / ఐఏఫ్ఏఫ్ఐకు ఎంపికైన ఏకైక తెలుగు చిత్రం

ఐఏఫ్ఏఫ్ఐకు ఎంపికైన ఏకైక తెలుగు చిత్రం

గత ఏడాది విడుద‌లై ఘ‌న విజ‌యం సాధించిన తెలుగు చిత్రం `ఎఫ్ 2`కి అరుదైన గౌర‌వం ద‌క్కింది. అదేంటంటే గోవాలో జ‌ర‌గ‌బోయే 50వ గోల్డెన్ జూబ్లీ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలిమ్ ఫెస్టివ‌ల్ ఆఫ్ ఇండియా(ఐఏఫ్ఏఫ్ఐ) ప్ర‌ద‌ర్శ‌న‌కు ఈ సినిమా ఎంపికైంది. న‌వంబ‌ర్ 20 నుండి 28 వ‌ర‌కు గోవాలో జ‌ర‌గ‌బోయే ఐఏఫ్ఏఫ్ఐ వేడుక‌లో 76 దేశాల‌కు చెందిన‌ 250 సినిమాలు ప్ర‌ద‌ర్శితం కానున్నాయి. ఈ లిస్టులో 26 ఫీచ‌ర్ ఫిలింస్‌, 15 నాన్ ఫీచ‌ర్ ఫిలింస్ కూడా ఉన్నాయి. కాగా.. ఈ 26 ఫీచ‌ర్ ఫిలింస్‌లో ఎంపికైన ఏకైక తెలుగు చిత్రంగా `ఎఫ్ 2` అరుదైన గౌర‌వాన్ని ద‌క్కించుకుంది. అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్, త‌మ‌న్నా, మెహ‌రీన్ హీరో హీరోయిన్లుగా న‌టించారు. ఈ వేడుక‌కి ప‌ది వేల మంది హాజ‌ర‌వుతార‌ని ప్ర‌భుత్వం భావిస్తుంది.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *