Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు మహిళలపట్ల చులకనగా మాట్లాడటం సహించరాని విషయం…

ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు మహిళలపట్ల చులకనగా మాట్లాడటం సహించరాని విషయం…

అమరావతి :
రేపిస్టులను శిక్షించకుండా కేవలం బెత్తంతో రెండు దెబ్బలు కొడితే సరిపోతుందని జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలు మహిళల మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయని ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి విమర్శించారు. ఆడపిల్లల మాన ప్రాణాలంటే పవన్‌ కళ్యాణ్‌కు అంత చులకనా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలపట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగేలా మాట్లాడటం దుర్మార్గమన్నారు. తక్షణమే ఆ వ్యాఖ్యలను ఉప సంహరించుకోవాలని, మహిళలందరికీ బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని ఆమె బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. దిశా ఘటన అనంతరం నిందితులకు కఠిన శిక్షలు విధించాలని నిలదిస్తుంటే పవన్‌ కళ్యాణ్‌ మాత్రం బెత్తంతో కొట్టి దోషులను వదిలేయమనడం  ఆయన బాధ్యతా రాహిత్యాన్ని తెలియజేస్తుందన్నారు. ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు మహిళలపట్ల చులకనగా మాట్లాడటం సహించరాని విషయమన్నారు. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు, హత్యలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించేందుకు త్వరలో కొత్త చట్టాన్ని తేనున్నట్లు పేర్కొన్నారు.

 

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *