Breaking News
Home / National / పొత్తుపై అదే చివరిమాట కాకపోవచ్చు: చిదంబరం

పొత్తుపై అదే చివరిమాట కాకపోవచ్చు: చిదంబరం

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో సంబంధం లేకుండా సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్ సమాజ్‌ పార్టీ కలిసి పోటీ చేస్తున్నట్టు శనివారంనాడు లక్నోలో జరిగిన సంయుక్త మీడియా సమావేశంలో అఖిలేష్ యాదవ్, మాయావతి అధికారికంగా ప్రకటించడంపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం స్పందించారు. బహుశా అదే వారి చివరిమాట కాకపోవచ్చని అన్నారు.

ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పొత్తులపై ఎస్పీ, బీఎస్‌పీ పునరాలోచించే అవకాశాలుండొచ్చని చిదంబరం అభిప్రాయపడ్డారు. విశాల దృక్పధంతో కూడిన అసలు సిసలైన కూటమి ఉత్తరప్రదేశ్‌లో ఏర్పడాల్సి ఉంటుందన్నారు. తప్పనిసరైతే కాంగ్రెస్ సొంత బలంతోనే యూపీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని చిదంబరం స్పష్టం చేశారు.

Check Also

హోలీ వేడుకల్లో విషాదం

Share this on WhatsAppసముద్రంలో అలలకు కొట్టుకుపోయి ఐదుగురి గల్లంతు… యువకుడి మృతదేహం లభ్యం ముంబై : హోలీ వేడుకల్లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *