Breaking News
Home / States / Andhra Pradesh / మరో 3 రోజులు వర్షాలు

మరో 3 రోజులు వర్షాలు

హైదరాబాద్: తూర్పు మధ్య అరేబియా సముద్రంలో అల్పపీడనం కొనసాగుతున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం సోమవారం ప్రకటించింది. దీనికి అనుబంధంగా 4.5 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. తూర్పు మధ్య అరేబియా సముద్రం నుంచి దక్షిణ చత్తీస్‌గఢ్‌ వరకు ఉత్తర కర్ణాటక, తెలంగాణ మీదుగా 2.1 కి.మీ ఎత్తువరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దక్షిణ తమిళనాడు, దాన్ని ఆనుకొని ఉన్న ఉత్తర శ్రీలంక, కోమోరిన్‌ ప్రాంతాల నుంచి ఉత్తర కోస్తాంధ్ర వరకు నైరుతి బంగాళాఖాతం మీదుగా అల్పపీడన ద్రోణి ఆవరించింది. ఈ ప్రభావంతో రాగల 48 గంటల్లో ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర తీరాలకు దగ్గరలో నైరుతి బంగాళాఖాతం, దానిని ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వచ్చే మూడురోజులు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *