ఫిల్మ్ న్యూస్: బాలీవుడ్లో బయోపిక్‌ల జోరు కొనసాగుతూనే ఉంది. అన్ని రంగాల ప్రముఖుల జీవిత నేపథ్యంలో సినిమాలు తెరకెక్కుతున్న క్రమంలో తాజాగా ఐటీ విప్లవానికి నాంది పలికిన ఇన్ఫోసిస్ ఛైర్మన్ ఎన్ఆర్ నారాయణమూర్తి ఆయన సతీమణి సుధా మూర్తి జీవిత నేపథ్యంలో చిత్రాన్ని తెరకెక్కించేందుకు దర్శకురాలు అశ్విని అయ్యర్ తివారీ సిద్ధమైంది. మంగళవారం చిత్రానికి సంబంధించి అఫీషియల్ ప్రకటన చేయగా, మూవీకి మూర్తి అనే టైటిల్ ఫిక్స్ చేశారు. మూర్తి చిత్రానికి అశ్వినితో పాటు ఆమె భర్త నితీశ్, మహావీర్ జైన్ లు కూడా నిర్మాణంలో పాలుపంచుకోనున్నారు. అశ్విని ప్రస్తుతం కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో పంగా అనే సినిమా తెరకెక్కిస్తుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తైన వెంటనే నారాయణమూర్తి బయోపిక్ తెరకెక్కించనుంది.
