Breaking News
Home / National / అది సాధించడం అంత ఈజీ కాదు: మోదీ

అది సాధించడం అంత ఈజీ కాదు: మోదీ

న్యూఢిల్లీ: ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థను రూపొందించడం అంత సులువేమీ కాదని, అయితే సాధించగలమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ప్రస్తుతం భారత ఆర్ధిక వ్యవస్థ 3 ట్రిలియన్ డాలర్లుగా ఉందని, అయితే దీనికోసం 70 సంవత్సరాలు పట్టిందన్నారు. 70 ఏళ్లు పట్టడంపై ఎవ్వరూ కనీసం ప్రశ్నించలేదని, ఎవ్వరూ సమాధానం కూడా చెప్పలేదని మోదీ గుర్తు చేశారు. అయితే 5 ట్రిలియన్ డాలర్ల లక్ష్యాన్ని పెట్టుకున్న తమను కొందరు ప్రశ్నిస్తున్నారని చెప్పారు. 5 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థను రూపొందించాలంటే తయారీ రంగంతో పాటు ఎగుమతులు పెరగాలన్నారు. ఈ విషయంలో తమ ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకుందని చెప్పారు. న్యూ ఇండియా అనేక సమస్యలను అధిగమించగలిగిందని మోదీ చెప్పారు. ఓ టీవీ ఛానెల్ నిర్వహించిన కార్యక్రమంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *