Breaking News
Home / National / జడేజా బ్యాటింగ్.. రోహిత్ సిగ్నల్.. వీడియో వైరల్

జడేజా బ్యాటింగ్.. రోహిత్ సిగ్నల్.. వీడియో వైరల్

మాంచెస్టర్: ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో బుధవారం జరిగిన మొదటి సెమీఫైనల్ భారత జట్టు 18 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. నిజానికి అత్యంత దారుణంగా ఓడిపోవాల్సిన జట్టును రవీంద్ర జడేజా గట్టెక్కించాడు. ఒకానొక దశలో గెలుపుపై ఆశలు రేపాడు. అయితే, అతడు అవుటయ్యాక భారత అభిమానుల ఆశలు అడియాసలయ్యాయి. 59 బంతులు ఎదుర్కొన్న జడేజా 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 77 పరుగులు చేశాడు.

జట్టులోని టాప్ బ్యాట్స్‌మెన్ అందరూ పెవిలియన్‌కు క్యూ కట్టిన వేళ క్రీజులో కుదురుకున్న జడేజా మెరుపులు మెరిపించిన తీరు అభిమానుల మన్ననలు అందుకుంది. జడేజా 39 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసి డ్రెస్సింగ్ రూమువైపు బ్యాట్ చూపిస్తూ అభివాదం చేశాడు. అది చూసిన రోహిత్ శర్మ తన కుడిచేతిని మడిచి కండను చూపిస్తూ ‘నువ్వు చాలా స్ట్రాంగ్’ అనే అర్థం వచ్చేలా సిగ్నల్ ఇచ్చాడు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

Check Also

మరోసారి వార్తల్లో నిత్యానంద

Share this on WhatsAppఅహ్మదాబాద్: నిత్యానంద నిర్వహణలో ఉన్న స్కూల్లో తమ ఇద్దరు కూతుళ్లను నిర్భంధించారని..వారిని విడిపించాలంటూ గుజరాత్ హైకోర్టులో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *