Breaking News
Home / States / Andhra Pradesh / చరిత్ర సృష్టించే దమ్మున్న ముఖ్యమంత్రి జగన్….

చరిత్ర సృష్టించే దమ్మున్న ముఖ్యమంత్రి జగన్….

తూర్పు గోదావరి: రాష్ట్రంలో నిశ్శబ్ధ విప్లవం ప్రారంభమైందనడానికి గ్రామ సచివాలయాల వ్యవస్థే నిదర్శనమని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. సోమవారం రాష్ట్ర ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాలల్లో 19 రకాల పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు జిల్లాల వారీగా నియామక ప్రతాలను అందజేసింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… గ్రామ సచివాలయాల ఉద్యోగాల భర్తీతో సీఎం జగన్‌ చరిత్ర సృష్టించారన్నారు. పైరవీలకు చోటు లేకుండా నిరుద్యోగులు ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలు సంపాదించుకున్నారని తెలిపారు.

ముఖ్యమంత్రి ప్రతినిధులుగా గ్రామ సచివాలయ ఉద్యోగులు క్షేత్ర స్థాయిలో ప్రజలతో మమేకం కావాలని పిలుపునిచ్చారు. చరిత్ర సృష్టించే దమ్మున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని ప్రశంసించారు. పాదయాత్రలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలో భాగంగానే గ్రామ సచివాలయ ఉద్యోగాలు అందించారని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల కాలంలో నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చి జగన్‌ రికార్డు సృష్టించారన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *