Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / బాబాయిని హత్య చేసిందవరో ఆయనకు తెలుసు…

బాబాయిని హత్య చేసిందవరో ఆయనకు తెలుసు…

అమరావతి: వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేసిన వారెవరో ఏపీ సీఎం జగన్‌కు తెలుసని టీడీపీ నేత వర్ల రామయ్య అన్నారు. బాబాయిని హత్య చేసిన వారి పేరును బయటికి వెల్లడించకుండా జగన్ దాస్తున్నారని ఆరోపించారు. ఈ కేసుపై విచారణ జరుపుతున్న కడప ఎస్పీని ఎందుకు బదిలీ చేశారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. నిందితుడు ఎవరో ఎస్పీకి తెలిసినందువల్లే బదిలీ చేశారని విమర్శించారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఈ హత్య కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేసిన జగన్.. ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. నిందితుడుని వెంటనే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *