Breaking News
Home / National / అమిత్‌ షాతో ముగిసిన జగన్‌ భేటీ…

అమిత్‌ షాతో ముగిసిన జగన్‌ భేటీ…

న్యూఢిల్లీ: ఏపీ సీఎం జగన్‌ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ ముగిసింది. ఈ సందర్భంగా అమిత్ షాకు జగన్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర పునర్విభజన చట్టం కింద రావాల్సిన పలు పెండింగ్ అంశాలను గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టుపై ఏపీ బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలపై కూడా అమిత్ షాతో మాట్లాడినట్టు తెలుస్తోంది. కాసేపట్లో కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తో జగన్ భేటీ కానున్నారు. అనంతరం మరో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కలవనున్నారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *