Breaking News
Home / States / Andhra Pradesh / గ్రామ సచివాలయ ఉద్యోగాల్లో ఊహించని ట్విస్ట్ ఇచ్చిన జగన్ సర్కార్ !

గ్రామ సచివాలయ ఉద్యోగాల్లో ఊహించని ట్విస్ట్ ఇచ్చిన జగన్ సర్కార్ !

చిత్తూరు: గ్రామ సచివాలయ ఉద్యోగుల నియామకాల్లో మరో వివాదం చోటుచేసుకుంది. వార్డు వెల్ఫేర్ డెవలప్‌మెంట్‌ సెక్రటరీ అభ్యర్థులకు ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది. డిగ్రీలో బీకాం గ్రూపు చదివిన అభ్యర్థులు అర్హులు కాదని అధికారులు ప్రకటించారు. అపాయింట్‌మెంట్‌ ఆర్డర్లతో పాటు శిక్షణ ఇచ్చి ప్రభుత్వం తిరస్కరించడంపై అభ్యర్థులు మండిపడుతున్నారు. చిత్తూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎదుట బాధితులు ధర్నాకు దిగారు. చిత్తూరు జిల్లాలో సుమారు 40 మంది మంది బాధితులు ఉన్నారు. ఆత్మహత్యే శరణ్యం అని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కడప జిల్లాలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది.

కడప నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట బాధిత అభ్యర్థులు ఆందోళనకు దిగారు. వార్డ్ వెల్ఫేర్ డెవలప్‌మెంట్‌ సెక్రటరీ పోస్టులకు అపాయింట్‌మెంట్లు ఇచ్చి రెండురోజుల్లో విధుల్లో చేరనున్న తరుణంలో అధికారులు రిజెక్ట్‌ చేశారు. తమకు న్యాయం చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. ప్రతిభ ఉన్నా రిజెక్ట్‌ చేయడం సమంజసం కాదని 49 మంది అభ్యర్థులు వాపోతున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *