Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై జగన్ సర్కార్ తాజా నిర్ణయమిది..!

ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై జగన్ సర్కార్ తాజా నిర్ణయమిది..!

అమరావతి: ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం డిమాండ్‌తో తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగితే.. విలీనం ససేమిరా అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తేల్చి చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది. ఇదిలా ఉంటే.. ఏపీలో ఆర్టీసీ విలీన ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఆర్టీసీ విలీన ప్రక్రియ పూర్తి చేసేందుకు వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేస్తున్నట్లు జగన్ సర్కార్ ప్రకటించింది. ఏడుగురు సభ్యులతో వర్కింగ్ గ్రూప్‌ను నియమిస్తూ జీవో జారీ చేసింది.

ఆర్థిక, సాధారణ పరిపాలన, రవాణా, న్యాయ శాఖల అధికారులతో గ్రూప్‌ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రజా రవాణా శాఖ ఏర్పాటు, పోస్టులు, డిజిగ్నేషన్ల ఏర్పాటుపై వర్కింగ్ గ్రూప్ దృష్టి సారించనుంది. జీతాల చెల్లింపు, పే-స్కేల్ విధి విధానాలను వర్కింగ్ గ్రూప్ ఖరారు చేయనుంది. నవంబర్ 15లోగా నివేదిక ఇవ్వాలని వర్కింగ్ గ్రూపునకు ప్రభుత్వం ఆదేశించింది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *