తిరుపతి: తిరుమల శ్రీవారికి ముఖ్యమంత్రి వైయస్ జగన్ పట్టు వస్త్రాలు సమర్పించారు. కొద్ది సమయం క్రితమే ఆలయానికి చేరుకున్న జగన్.. వెంకటేశ్వరుడికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంరతం పెద్దశేష వాహన సేవలో పాల్గొననున్నారు. ఈ రాత్రికి తిరుమలలోనే బస చేయనున్నారు. రేపు ఉదయం తిరుమల నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకొని విజయవాడకు వెళ్లనున్నారు.
