విజయవాడ: సీబీఐ కేసుల్ని ప్రభావితం చేసేందుకే ముఖ్యమంత్రి జగన్ ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలుస్తున్నారని టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ విమర్శించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ… బీజేపీ అగ్రనేతలను జగన్ కలిసిన ప్రతిసారీ ప్రజల్లో ఎన్నో అనుమానాలు కలుగుతున్నాయని, ప్రజల అనుమానాలు బీజేపీ నివృత్తి చేయాలని డిమాండ్ చేశారు. కోర్టులో సీబీఐ చెప్పినట్టుగా జగన్ బెయిల్ నిబంధనలు ఉల్లంఘించారని ఆమె ఆరోపించారు. నిందితులకు టీటీడీ పదవులు కట్టబెట్టారని, జడ్జీలు కూడా ఆశ్చర్యపోయేంత అవినీతి చేసి తమపై నిందలు వేస్తారా? అంటూ ఆమె ప్రశ్నించారు. చిదంబరం బెయిల్‌కు జగన్ కేసుల్ని ఉదాహరణలుగా చెబుతున్నారని పంచుమర్తి అనురాధ వ్యాఖ్యానించారు.
