Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / జగనన్న విద్యా దీవెనకు ప్రభుత్వం ఉత్తర్వులు…

జగనన్న విద్యా దీవెనకు ప్రభుత్వం ఉత్తర్వులు…

అమరావతి : జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాల అమలుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకం ద్వారా పూర్తిస్థాయిలో ఫీజు రియంబర్స్‌మెంట్‌ చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. బీసీ, కాపు, ఎస్‌సి, ఎస్‌టి, మైనారిటీ, అగ్రవర్ణాల పేదలకు ఈ పథకం వర్తిస్తుంది. ఐటీఐ నుంచి పీహెచ్‌డీ వరకు అన్ని ఉన్నత విద్యలకు ఫీజు రీయంబర్స్‌మెంట్‌ అమలు కానుంది.

పథకం కింద పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందనుంది. జగనన్న వసతి దీవెన కింద ఐటీఐ కి రూ.10 వేలు, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు రూ.15 వేలు అందుతాయి. డిగ్రీ, ఇతర ఉన్నత చదువులు చదివే విద్యార్థులకు ఏడాదికి రూ.20 వేలు వసతి దీవెన సహాయం లభించనుంది. వార్షిక ఆదాయం రూ.2.50 లక్షలలోపు ఉన్న పేద కుటుంబాలందరికి ఈ పథకం వర్తింస్తుంది. అర్హులయిన విద్యార్థుల ఎంపిక చేపట్టాలని సంబంధింత శాఖలను ఆదేశిస్తూ ఎపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *