Breaking News
Home / States / Andhra Pradesh / మానవత్వాన్ని చాటుకున్న సీఎం జగన్…

మానవత్వాన్ని చాటుకున్న సీఎం జగన్…

కాకినాడ: కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న బాలికకు రూ.25 లక్షలను సీఎం రిలీఫ్‌ ఫండ్‌ ద్వారా మంజూరు చేసి సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ నెల 2వ తేదీన గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రారంభించడానికి కరప వచ్చిన సీఎం జగన్‌కు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి పట్టణానికి చెందిన ఎం.నందిని కాలేయవ్యాధితో గత కొంతకాలంగా బాధపడుతోందని తెలియజేశారు.

అప్పట్లో సానుకూలంగా జగన్‌ స్పందించారు. గత రెండు రోజులుగా నందిని పరిస్థితి విషమించడంతో నగర ఎమ్మెల్యే చంద్రశేఖర్ కు నందిని తండ్రి వెంకటరమణ ఫోన్ చేసి విషయం చెప్పారు. వెంటనే ఈ విషయాన్ని సీఎం జగన్‌ దృష్టికి తీసుకువెళ్లగా హుటాహుటిన ఆయన స్పందించి రూ.25 లక్షలు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ ద్వారా అందించేందుకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో యశోద ఆసుపత్రి వైద్యులు నందినికి శస్త్రచికిత్స చేశారు. నందిని ప్రాణాలు కాపాడిన ఎమ్మెల్యే ద్వారంపూడికి, సీఎం జగన్‌కు బాలిక తండ్రి, కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *