Breaking News
Home / States / కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపిన జగ్గారెడ్డి….

కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపిన జగ్గారెడ్డి….

హైదరాబాద్: రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చి..రెండో పర్యాయం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సీఎం కేసీఆర్‌కు సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆరోగ్యంగా ఉండి మంచి పాలన అందిస్తారని ఆశిస్తున్నానని అన్నారు. గత ఎన్నికల్లో కేసీఆర్ అనేక హామీలు ఇచ్చారని, రైతు రుణమాఫీ ఇప్పటి వరకు చేయలేదన్నారు. రైతు బంధు డబ్బులు ఇప్పటి వరకు 60 శాతం రైతులకు రాలేదన్నారు. రూ. 3,016 నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు.. ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.

రాష్ట్రంలో అవినీతి ఉండదన్నారని, తెలంగాణ అవినీతిలేని రాష్ట్రాంగా ఉందా? అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో 12000 పాఠశాలలు మూసివేయాల్సిన దుస్థితి ఎందుకొచ్చిందన్నారు. అక్షరాస్యతలో తెలంగాణ దేశంలో 13వ స్థానాల్లో ఉండటం బాధాకరమన్నారు. ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోయాయని, తెలంగాణ.. హత్యలు, ఆత్మహత్యలు, మర్డర్ల రాష్ట్రంగా మారిందన్నారు. క్రైమ్‌లో రెండో స్థానంలో ఉందని, జూనియర్, డిగ్రీ కాలేజీలకు టిఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క సొంత భవనం కూడా కట్టలేదని విమర్శించారు. గ్రామ పంచాయితీలకు, మున్సిపాలిటీలకు నిధులు లేవని, అభివృద్ధి ఎలా జరుగుతుందని ప్రశ్నించారు.కేసీఆర్ తియ్యటి మాటలతో పేదల కడుపులు నిండటం లేదని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *