అమరావతి: జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేష్ మాట్లాడుతూ రైతు భరోసా కింద రూ.12,500 ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కేంద్రం ఇచ్చే రూ.6 వేలతో కలిపి ఇస్తామంటూ మోసం చేస్తున్నారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం రైతు భరోసాను రైతు వంచనగా మారుస్తోందని ఆరోపించారు. కౌలు రైతుల్లో 30 శాతం మందినే అర్హులుగా గుర్తించారని, ఇంకా 14 లక్షల మంది కౌలు రైతులకు సాయం అందడం లేదన్నారు. రైతుల మధ్య కులాల చిచ్చు పెట్టిన ఘనత జగన్‌దేనని ఆయన అన్నారు.
