Breaking News
Home / States / Andhra Pradesh / పవిత్ర గంగా హారతిలో జనసేనాని…

పవిత్ర గంగా హారతిలో జనసేనాని…

విజయవాడ: హరిద్వార్‌ పర్యటనలో ఉన్న జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ శనివారం ఉదయం పవిత్ర గంగా హారతిలో పాల్గొన్నారు. అనంతరం పవన్‌ మాట్లాడుతూ గంగా ప్రక్షాళన కార్యక్రమానికి తనవంతు కృషి చేస్తానని, అందుకు అనుగుణంగా ప్రజల నమ్మకాలు, విశ్వాసాలను దృష్టిలో పెట్టుకుని నడుచుకుంటానన్నారు. గంగను కాలుష్యానికి గురికాకుండా మన సంస్కృతిని పరిరక్షించేందుకు తీసుకోవాల్సిన అంశాలపై స్థానికులతో చర్చించారు. గంగానది ప్రక్షాళన కోసం దక్షిణాది రాష్ట్రాల నుంచి పెద్దగా మద్దతు రావడం లేదని ఆ లోటును భర్తీ చేయాలని మాత్రిసదన్‌ ఆశ్రమ ప్రతినిధులు పవన్‌ కల్యాణ్‌ను కోరారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *