Breaking News
Home / States / Andhra Pradesh / Anantapur / ‘మా నాన్న మాటలతో నాకేం సంబంధం..

‘మా నాన్న మాటలతో నాకేం సంబంధం..

సీఎం శ్రమతోనే కియ పరిశ్రమ
మాట ప్రకారమే నిరుద్యోగులకు ఉద్యోగాలు
వైసీపీ వారిది గోబెల్స్‌ ప్రచారం
మళ్లీ టీడీపీదే గెలుపు.. చంద్రబాబే సీఎం
ఎన్నికల ఖర్చు పెరిగిందనే మా నాన్న చెప్పారు
టీడీపీ ఎంపీ అభ్యర్థి జేసీ పవన్‌కుమార్‌ రెడ్డి
అనంతపురం: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కష్టం, శ్రమ వల్లే జిల్లాకు కియ కార్ల పరిశ్రమ వచ్చిందని అనంతపురం పార్లమెంటు టీడీపీ అభ్యర్థి జేసీ పవన్‌కువర్‌రెడ్డి పేర్కొన్నారు. జిల్లాలోని నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేర కు కియ పరిశ్రమలో పలువురికి ఆయన ఉద్యోగాలు కల్పించారు. ఇందులో భాగంగా బుధవారం పలువురికి ఉద్యోగ ఉత్తర్వులందజేశారు. అనంతరం నగరంలోని లక్ష్మీనగర్‌లో గల తమ నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలకు అందుబాటులో ఉంటే వారే గౌరవిస్తారన్నారు. తాను చేసిన మంచిపనులు, పార్టీ కారణంగా ఎన్నికల్లో తనను అన్నినియోజకవర్గాల ప్రజలు ఆదరించారన్నారు.

తాను అందరిలాంటి రాజకీయ నాయకుడిని కాదన్నారు. తాను చేసింది ప్రజలకు చెబుతూ వెళ్లానన్నారు. సీఎం చం ద్రబాబు ఎంతో కష్టపడి కియ పరిశ్రమ తీసుకురావడం వల్ల జిల్లాలో నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయన్నారు. ఇందులో భాగంగానే తానుకూడా ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చానన్నారు. ఇప్పటికే 431 మందికి ఉద్యోగావకాశాలు క ల్పించానన్నారు. ఎన్నికల ఖర్చు పెరుగుతోందని తన తండ్రి దివాకర్‌రెడ్డి తన అభిప్రాయం వ్యక్తం చేశారన్నారు. రూ.50 కోట్లు ఎక్కడా, ఎవరూ ఖర్చుపెట్టలేదన్నారు. తొలివిడతలో ఎన్నికలు జరిగాయి కాబట్టి కొంత ఖర్చు తగ్గిందని, చివరి విడత జరిగి ఉంటే ఇంకా ఎంత ఖర్చయి ఉండేదోనని ప్రజలే అనుకుంటున్నారన్నారు. ఎన్నికల వ్యయంపై ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేశారని, ఆయన మాటలతో తనకెందుకు సంబంధముంటుందన్నారు. అయితే ఎన్నికల వ్యయం తగ్గించడానికి ఆయన నాన్‌పొలిటికల్‌ ఫోరం ఏర్పాటుచేసి చైతన్యం తీసుకురావాలని నిర్ణయించారన్నారు. అందుకు తన మద్దతు పూర్తిగా ఉంటుందన్నారు. రాబోయే ఎన్నికల నాటికి ఖర్చు తగ్గించడమే లక్ష్యంగా అందరం కృషి చేద్దామన్నారు.

వైసీపీ వారిది గోబెల్స్‌ ప్రచారమనని జేసీ పవన్ అన్నారు.. ‘మేం గెలుస్తున్నాం. అధికారంలోకి వస్తున్నాం’ అంటూ వారు చంకలు గుద్దుకుంటున్నారన్నారు. గట్టిగా అరిస్తే ఫలితాలు మారవని ఎద్దేవా చేశారు. మళ్లీ తెలుగుదేశం పార్టీనే గెలుస్తుందని జేసీ పవన్‌ జోస్యం చెప్పారు. గత ఎన్నికల కన్నా మరింత మెజార్టీతో రాష్ట్రంలో మళ్లీ చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపడతారన్నారు. ‘ఈవీఎంలు పనిచేయలేదు. ఇది అందరికీ తెలుసు. మా నాయకుడు చంద్రబాబు జాతీయనేత. ఇతర రాష్ట్రాల్లోనూ ఇలాంటి ఈవీఎంల సమస్య తలెత్తకూడదు. ఇబ్బందులు పడకూడదు’ అనే ఉద్దేశంతోనే పోరాటం చేస్తున్నారన్నారు. దీనికి టీడీపీ ఓడిపోతోందని వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తూ సంబరపడిపోతున్నారన్నారు. ఇది తాత్కాలికమేనన్నారు.

కొందరు రాజకీయ దళారుల మాటలు విని పందేలు కాస్తున్నారన్నారు. ఇది మంచిపద్ధతి కాదని, పందేలకు వెళ్లి జీవితాలు నాశనం చేసుకోవద్దని అన్ని పార్టీల వారికీ పవన్‌ విఙ్ఞప్తిచేశారు. ఈవీఎంల ట్యాంపరింగ్‌ జరుగుతోందని రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా ప్రచారం జరుగుతోందని, అది నిజమో.. కాదో.. తనకు తెలియదన్నారు. అయితే వీవీప్యాట్‌ స్లిప్పులు లెక్కించి ప్రజల్లో ఉన్న అనుమానాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌పై ఉందన్నారు.

Check Also

కోస్తా జిల్లాల్లో ఒక్కసారిగా వాతావరణం

Share this on WhatsAppఅమరావతి: కోస్తా జిల్లాల్లో ఒక్కసారిగా వాతావరణం మారింది. ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *