Breaking News
Home / Education / నేటి నుంచి జేఈఈ మెయిన్‌

నేటి నుంచి జేఈఈ మెయిన్‌

హైదరాబాద్‌: ఐఐటీ, ఎన్‌ఐటీల్లో ప్రవేశానికి గాను జేఈఈ మెయిన్‌ తొలి విడత పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. దీనికోసం నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్టీఏ) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. నిర్దేశించిన సమయానికంటే ఒక్క నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. సోమవారం బీఆర్క్‌లో ప్రవేశానికి పేపర్‌-2 పరీక్ష, 7 నుంచి 9వ తేదీ వరకు బీటెక్‌లో ప్రవేశానికి పేపర్‌-1 పరీక్షలు జరగనున్నాయి. ఆన్‌లైన్‌ విధానంలో ఈ పరీక్షలను ప్రతి రోజు రెండు షిఫ్టుల్లో నిర్వహించనున్నారు. మొదటి షిఫ్టు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు, రెండో షిఫ్టు మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సా. 5:30 గంటల వరకు జరుగుతుంది. మొదటి షిఫ్టు విద్యార్థులు ఉదయం 9గంటల లోపు, రెండో షిఫ్టు విద్యార్థులు మధ్యాహ్నం 2గంటలలోపు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా సుమారు 9.30లక్షల మంది విద్యార్థులు హాజరవుతుండగా తెలంగాణ నుంచి సుమారు 70వేల మంది హాజరయ్యే అవకాశం ఉంది. మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడకుండా అధికారులు పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.

Check Also

కేసీఆర్ ఇంట్లోకి కరోనా.! ఐదుగురికి పాజిటివ్.!

Share this on WhatsAppతెలంగాణలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంది. పేద, ధనిక అనే తేడా లేకుండా స్వైరవిహారం చేస్తుంది. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *