హైదరాబాద్: ఐఐటీ, ఎన్ఐటీలలో ప్రవేశానికిగాను జేఈఈ మెయిన్ రెండో దశ పరీక్షను ఏప్రిల్ 5 నుంచి నిర్వహించనున్నట్లు జాతీయ పరీక్ష సంస్థ(ఎన్టీఏ) వెల్లడించింది. ఈ పరీక్షలను 5, 7, 8, 9, 11 తేదీల్లో నిర్వహించనుంది. ఇందుకు సంబంధించి ఫిబ్రవరి 7 నుంచి దరఖాస్తులను స్వీకరించనుంది. గతంలో జేఈఈ రెండో దశ పరీక్షలను ఏప్రిల్ 3 నుంచి 9 వరకు నిర్వహించేందుకు తాత్కాలిక షెడ్యూల్ను జారీ చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా నూతన తేదీలను ప్రకటించింది.
