Breaking News
Home / States / Andhra Pradesh / 17న నింగిలోకి జీశాట్‌-30

17న నింగిలోకి జీశాట్‌-30

శ్రీహరికోట (సూళ్లూరుపేట): కొత్త ఏడాది తొలి ఉపగ్రహ ప్రయోగానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సిద్ధమైంది. దక్షిణ అమెరికాలో ఉన్న ఫ్రెంచ్‌ గయానాలోని యూరోపియన్‌ స్పేస్‌ పోర్టు నుంచి ఈ నెల 17న జీశాట్‌-30 ఉపగ్రహాన్ని ప్రయోగించే ఏర్పాట్లు చేస్తోంది. ఎరియన్‌-5 ఈసీఏ రాకెట్‌ ద్వారా ఈ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నట్టు ఇస్రో చైర్మన్‌ కె శివన్‌ ప్రకటించారు. 2005లో ప్రయోగించిన ఇన్‌శాట్‌-4ఏ కాలపరిమితి గతేడాది అక్టోబరు 21తో ముగిసింది. దాని స్థానంలో జీశాట్‌-30 సేవలు అందించనుంది. 3,450 కిలోల బరువున్న ఈ ఉపగ్రహం 15 ఏళ్లపాటు పనిచేస్తుందని శివన్‌ తెలిపారు.

100 జీబీపీఎస్‌ వేగం..
భారత్‌లో ఇంటర్నెట్‌ సేవలను సెకనుకు 100 గిగాబైట్ల వేగం (జీబీపీఎస్‌)తో అందించేందుకు ఇస్రో కృషి చేస్తోంది. దీనికోసం 2017లో జీశాట్‌- 17, 2018లో జీశాట్‌-29, జీశాట్‌-11 ఉపగ్రహాలను ప్రయోగించింది. మరింత మెరుగైన ఫలితాల కోసం ప్రస్తుతం జీశాట్‌-30ని ప్రయోగిస్తోంది. ఈ 4 ఉపగ్రహాలతో దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇంటర్నెట్‌ స్పీడ్‌ పెరుగుతుందని ఇస్రో తెలిపింది.

Check Also

డ్రోన్లతో చిత్రీకరించారనడం అవాస్తవం

Share this on WhatsAppగుంటూరు: గత ఐదేళ్లలో తెదేపా అవినీతి బాగోతాలు బయటకు వస్తున్నాయని హోంమంత్రి సుచరిత అన్నారు. ప్రజల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *