Breaking News
Home / National / చెన్నైకు చేరుకున్న జిన్‌పింగ్‌ కార్లు…

చెన్నైకు చేరుకున్న జిన్‌పింగ్‌ కార్లు…

చెన్నై: చైనా అధ్యక్షుడి పర్యటన కోసం 747 బోయింగ్‌ కార్గో విమానంలో 4 బుల్లెట్‌ ప్రూఫ్‌ కార్లు మంగళవారం చెన్నై విమానాశ్రయానికి చేరుకున్నాయి. నలుపు రంగు కలిగిన ఈ 4 కార్లు ఇంజన్‌ స్టార్ట్‌ అయిన 8 సెకన్ల లోపే గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలవు. బాంబు దాడులను కూడా తట్టుకుంటాయి. ఒక్కో కారు 18 అడుగుల పొడవు, 6.5 అడుగుల వెడల్పు, ఐదు అడుగుల ఎత్తు, 3152 కేజీల బరువు కలిగి ఉంటుంది. శుక్రవారం జిన్‌పింగ్‌ చెన్నై విమానాశ్రయానికి చేరుకోగానే ఈ 4 కార్లలో ఒకదాంట్లో ఎక్కి స్థానిక గిండీలోని స్టార్‌హోటల్‌కు వెళ్తారు. మహాబలి పురానికి కూడా ఈ కారులోనే చేరుకుంటారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *