Breaking News
Home / National / చెన్నైలో పర్యటించనున్న జిన్‌పింగ్…

చెన్నైలో పర్యటించనున్న జిన్‌పింగ్…

ఢిల్లీ: భారత్‌లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ పర్యటన ఖరారైంది. అక్టోబర్‌ 11-12 తేదీల్లో ప్రధాని నరేంద్ర మోదీ, జిన్‌పింగ్‌ లు తమిళనాడులోని చెన్నైలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రెండు దేశాధినేతలు చెన్నై సమీపంలోని కాంచీపురం జిల్లాలోని పర్యాటక ప్రాంతమైన మహాబలిపురాన్ని సందర్శించనున్నారు. ఇక్కడ ద్వైపాక్షిక చర్చలు నిర్వహించనున్నారు. కేంద్ర, రాష్ట్ర నిఘా విభాగం ఉన్నతాధికారులు ఇక్కడి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. గతేడాది రెండు రోజుల చెన్నై పర్యటనకు వెళ్లిన సమయంలో జిన్‌పింగ్‌ ను ప్రధాని మోదీ భారత్‌ కు ఆహ్వానించారు. ప్రపంచ చరిత్రాత్మక వారసత్వ ప్రదేశాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన మహాబలిపురాన్ని చివరికి ఖరారు చేశారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *