Breaking News
Home / Lifestyle / Business / ప్రీపెయిడ్ ఖాతాదారులకు షాకిచ్చిన జియో!

ప్రీపెయిడ్ ఖాతాదారులకు షాకిచ్చిన జియో!

ముంబై: రిలయన్స్ జియో తన ప్రీపెయిడ్ ఖాతాదారులకు షాకిచ్చింది. అతి తక్కువ ప్రీపెయిడ్ ప్లాన్ అయిన రూ. 98ను పూర్తిగా తొలగించింది. 28 రోజుల కాలపరిమితి కలిగిన ఈ ప్లాన్ ధరను ఇప్పుడు రూ.129కి పెంచేసింది. జియో రూ.98 ప్లాన్‌లో 2జీబీ హైస్పీడ్ డేటా, జియో నుంచి జియో, ల్యాండ్ లైన్ కాలింగ్ ప్రయోజనాలు ఈ ప్లాన్‌లో ఉండేవి. రూ. 999 ప్లాన్‌ను ప్రారంభించిన నేపథ్యంలో రూ. 98 ప్లాన్‌ను తొలగించింది. రూ. 999 ప్లాన్‌లో రోజుకు 3జీబీ హైస్పీడ్ డేటా 84 రోజుల కాలపరిమితితో లభిస్తుంది. ఇక, తొలగించిన రూ. 98 ప్రీపెయిడ్ ప్లాన్‌లో రోజుకు 300 ఎస్సెమ్మెస్‌లు, 2జీబీ హైస్పీడ్ డేటా, జియో నుంచి జియోకు కాల్స్ వంటి ప్రయోజనాలు 28 రోజుల కాలపరిమితితో లభించేవి.

Check Also

హర్యానాలో గంటలో రెండుసార్లు భూప్రకంపనలు

Share this on WhatsAppన్యూఢిల్లీ : కేవలం గంట సమయంలో శుక్రవారం రాత్రి రెండు సార్లు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనలు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *