Breaking News
Home / Lifestyle / Business / టారిఫ్ లను 39 శాతం పెంచిన జియో….

టారిఫ్ లను 39 శాతం పెంచిన జియో….

బిజినెస్ : ఈ నెల 6వ తేదీ నుంచి మొబైల్ ఫోన్ల టారిఫ్ ను పెంచుతున్నట్టు రిలయన్స్‌ జియో ఓ ప్రకటనలో వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న టారిఫ్ లతో పోలిస్తే 39 శాతం ధరలను పెంచిన జియో, ఈ ధరలు టెలికాం రంగంలోని ఇతర ప్రధాన సంస్థలు వసూలు చేస్తున్న ధరలతో పోలిస్తే తక్కువేనని వ్యాఖ్యానించింది. గతంలో ఉన్న ఆల్ ఇన్ వన్ ప్లాన్లతో పోలిస్తే, 300 శాతం అదనపు లాభాలను వినియోగదారులు పొందవచ్చని తెలిపింది.

రోజుకు 1.5 జీబీ డేటా, 84 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్యాక్ ధర ప్రస్తుతం రూ.399 ఉండగా, అది రూ. 555కు పెరిగింది. ఇప్పటివరకూ రూ. 153గా ఉన్న ప్లాన్‌ ధర, రూ.199 అయింది. రూ. 349 ప్లాన్‌ రూ. 399కి, రూ. 448 ప్లాన్‌ రూ. 599కి పెరిగాయి. ప్రస్తుతం ఏడాది ప్లాన్ కు రూ. 1,699 వసూలు చేస్తున్న సంస్థ, ఇకపై రూ. 2,199 వసూలు చేయనుంది. టారిఫ్ లో ఉన్న వ్యత్యాసాన్ని చూపుతూ ఓ టేబుల్ ను కూడా జియో విడుదల చేసింది.

Check Also

భారత్‌లో వివో డిజైన్‌ సెంటర్‌

Share this on WhatsApp50,000కు పెరగనున్న ఉద్యోగుల సంఖ్య ప్రీమియం సెగ్మెంట్‌లో ఎక్స్‌50 స్మార్ట్‌ఫోన్ల ఆవిష్కరణ ధర రూ. 34,990 …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *