Breaking News
Home / Lifestyle / Business / పెరగనున్న ‘జియో’ ధరలు..!

పెరగనున్న ‘జియో’ ధరలు..!

ముంబై : ఎయిర్‌టెల్, వొడాఫోన్‌ ఐడియాల బాటలోనే మొబైల్ డేటా రేట్లు పెంచేస్తుందా… ఇప్పడు జియో వినియోగదారుల్లో మెదులుతున్న ప్రశ్న ఇది. ప్రపంచం మొత్తం మీద మొబైల్ డేటా అత్యంత చౌకగా పొందుతున్నది భారతీయులే. కానీ, ఇప్పుడు ఆ ధరలు కాస్త పెరుగుతున్నాయి. వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్ సంస్థలు రెండూ కలిసి ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో దాదాపు రూ. 71 వేల కోట్ల మేరకు నష్టాలను చవిచూశాయి.

మార్కెట్‌లో ఆదాయపరంగా ఈ రెండు కంపెనీల వాటా సగానికి పై మాటే. భారత్ ధరల పట్ల సున్నితంగా ఉండే మార్కెట్ కావడంతో టారిఫ్‌లు విపరీతంగా పెరిగే అవకాశాలు తక్కువేనని నిపుణులు చెబుతున్నారు. ”పశ్చిమ దేశాలతో లేదా కొరియా, జపాన్, చైనా లాంటి దేశాలతో పోల్చి చూస్తే భారత్‌లో మొబైల్ టారిఫ్‌లు చాలా తక్కువ. ఒక వేళ ధరలు పెరిగినా, ఆ దేశాల దరిదాపుల్లోకి మాత్రం రావు” అని ప్రశాంతో కే రాయ్ చెప్పారు.

”వినియోగదారులు మరింత ఖర్చు చేసే పరిస్థితి తెచ్చి, ఒక్కో వినియోగదారుడిపై వచ్చే సగటు ఆదాయాన్ని పెంచుకోవడం ఆ ఆపరేటర్ల ఉద్దేశం. తాము పెద్ద మొత్తాల్లో చెల్లించాల్సిన లైసెన్సు ఫీజులను మాఫీ చేయమని కూడా ప్రభుత్వాన్ని అవి కోరతాయి” అని ఆయన చెప్పారు. తమ వ్యాపారాన్ని నిర్వహించుకునేందుకు ప్రభుత్వానికి టెలికాం సంస్థలు చెల్లించాల్సిన రుసుమే ‘లైసెన్స్ ఫీజు’.

భారతదేశంలో అత్యంత చౌకగా మొబైల్ డేటాను అందిస్తున్న సంస్థగా గుర్తింపు పొందిన రిలయన్స్ జియో… తన పోటీ సంస్థలైన ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాల బాటలోనే ధరల్ని పెంచనుందన్నది తెలిసిందే.
ఈ ఆర్ధిక సంవత్సరం రెండో త్రైమాసికంలో భారీగా నష్టాలు చవిచూడటంతో… ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలు రేట్లు పెంచుతున్నట్లు ప్రకటించాయి. కాగా, ధరల్ని ఏ మేరకు పెంచుతున్నదీ జియో స్పష్టం చేయలేదు.

Check Also

భారత్‌లో వివో డిజైన్‌ సెంటర్‌

Share this on WhatsApp50,000కు పెరగనున్న ఉద్యోగుల సంఖ్య ప్రీమియం సెగ్మెంట్‌లో ఎక్స్‌50 స్మార్ట్‌ఫోన్ల ఆవిష్కరణ ధర రూ. 34,990 …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *